ఏచూరికి విజయసాయి నివాళి

  • అణగారిన వర్గాల కోసం ఏచూరి పోరాడారన్న విజయసాయి
  • నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించారని ప్రశంస
  • ఏచూరితో కలిసి పని చేయడాన్ని మర్చిపోలేనని వ్యాఖ్య
కమ్యూనిస్టు అగ్ర నేత, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నివాళి అర్పించారు. సీపీఎం నేతలు బీవీ రాఘవులు, మధులను ఆయన పరామర్శించారు. 

ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ... అణగారిన వర్గాల పక్షాన రాజీలేని పోరాటం చేసిన యోధుడు సీతారాం ఏచూరి అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించారని చెప్పారు. ఏచూరితో పార్లమెంటులో కలిసి పని చేయడాన్ని మర్చిపోలేనని అన్నారు. తమ అధినేత జగన్, వైసీపీ తరపున ఏచూరికి నివాళి అర్పించానని చెప్పారు.

Vijayasai Reddy
YSRCP
Sitaram Yechury
CPM

More Telugu News